|
|
|
| Snehithuda | Telugu Previews | | Cast: Naani, Madhavi Latha Director:Satyam Bellamkonda Producer:Gemini Films Music:Shivashankar
 Synopsis 'స్నేహితుడా' చిత్రానికి దర్శకుడు సత్యం బెల్లంకొండ. ఈ చిత్రంలో 'అష్టాచమ్మా' ఫేం నాని, 'నచ్చావులే' ఫేం మాధవీలత జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై జెమిని ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నిర్మిస్తోంది.
సత్యం బెల్లంకొండ మాట్లాడుతూ 'నవ్యమైన కథ, కథనాలతో ప్రేమకథల్లో ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరించనున్న చిత్రమిది. స్నేహం, ప్రేమ విలువలను ఈ చిత్రంలో చూపెడుతున్నాం. ప్రేమలోని సున్నితమైన ఉద్వేగాలు అందరి మనసును హత్తుకుంటాయి. సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ లు కూడా సమపాళల్లో వుంటాయి. నాని, మాధవీలత పాత్రలు సరికొత్తగా ఉంటాయి. తప్పకుండా చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను' అన్నారు. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|
|
|
|
|