|
|
|
| Shashirekha Parinayam | Telugu Previews | | Cast: Tarun, Geneliya and others Director:Krishna Vamshi Producer:Sunkara Madhumurali Music:Manisharma
 Synopsis 'శశిరేఖా పరిణయం' చిత్రానికి దర్శకుడు కృష్ణవంశీ. తరుణ్, జెనీలియా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుంకర మదుమురళి నిర్మిస్తున్నారు.
'పెళ్లి అనే అంశం చుట్టూ ఈ చిత్ర కథనం వుంటుంది. అమలాపురం అమ్మాయి శశిరేఖ హైదరాబాద్ కి ఎందుకు ప్రయాణమైంది, అని ప్రశ్న వేయగానే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళిపోవాలి, లాంఛనాల గురించి పెద్దవాళ్లు మల్లగుల్లాలు పడుతుంటే శశిరేఖ తన అభిప్రాయాన్ని స్పష్టంగా, దైర్యంగా చెప్పింది. ఆ తరువాత అభితో ప్రయాణమైపోయింది. ఆ యాత్ర ఎలా సాగిందో 'శశిరేఖా పరిణయం' లో చూడాలి'. కృష్ణవంశీ దర్శకత్వంలో తొలిసారి తరుణ్, జెనీలియా నటిస్తున్నారు. 'ఖడ్గం' సినిమా తరువాత సుంకర మధుమురళి, కృష్ణవంశీ కలయికతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
నిర్మాత సుంకర మధుమురళి మాట్లాడుతూ 'తరుణ్ పాత్ర పేరు అభి. అతనికి, శశిరేఖకు ఎక్కడ పరిచయమయింది. వారి పయనమెటుసాగింది అనేవి ఆసక్తికరం. ఆహ్లాదకరంగా సాగే సినిమా ఇది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుదన్న నమ్మకం వుందని' అన్నారు. ఈ చిత్రం జనవరి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|
|
|
|
|