|
|
|
| Naa Ane Vaadu | Telugu Previews | | Cast: Rajeev Kanakala, Harish, Tanuja and others Director:T.Prashanth Producer:T.Prashanth Music:Saketh Sairam
 Synopsis 'నా అనేవాడు' చిత్రానికి దర్శకుడు టి.ప్రశాంత్. రాజీవ్ కనకాల, తనూజ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సద్గురుసాయి క్రియేషన్స్ పతాకంపై టి.ప్రశాంత్ నిర్మిస్తున్నారు.
దర్శకనిర్మాత టి.ప్రశాంత్ మాట్లాడుతూ 'ఏ మాత్రం స్వార్థం లేని ఇద్దరు స్నేహితుల మద్య వచ్చిన మనస్పర్దల వల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడ్డాయి వాటిని వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. రాజీవ్ కనకాల పాత్ర ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా ఉంటుంది. అలాగే హరీష్ పాత్ర కూడా అందర్ని అలరిస్తుంది. ఈ చిత్రంలో భానుచందర్ జైలర్ పాత్రను పోషించారు. ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ద్వారా తెలుగమ్మాయి తనూజను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 11 న విడుదలచేయనున్నారు. |  |
|
|
|
|
|