|
|
|
| Maghadheera - 2009 | Telugu Previews | | Trailer | Preview | Review | Gallery |
| Cast: Ramcharan Tej, Kajal Agarwal Director:S.S.Rajamouli Producer:Allu Aravind Music:M.M.Keeravani
 Synopsis 'మగధీర' చిత్రానికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింధ్ నిర్మిస్తున్నారు.
నిర్మాత అల్లుఅరవింద్ మాట్లాడుతూ 'అత్యున్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'మగధీర'. కథపరంగా భారీదనం ఉంది. అందుకు తగ్గటే భారీ వ్యయంతో సెట్స్ నిర్మించాం. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ మీదా ప్రత్యేక దృష్టి పెట్టాం. రామ్ చరణ్ లోని నటుణ్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా ఉంటుంది. ఇప్పటికే పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. కీరవాణి స్వరపరచిన బాణీలు, నేపథ్య సంగీతం ఆకర్షణ. మన రాష్ట్రంలోనే కాకుండాఈ చిత్రాన్ని 14 దేశాల్లో 1500 ప్రింట్లతో విడుదల చేస్తున్నట్లు' పేర్కొన్నారు.
'పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. చారిత్రాత్మక ప్రాంతాలైన రాజస్థాన్, గుజరాత్ ల్లో ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కించాము. శ్రీహరి ఇందులో ఓ ముఖ్య పాత్రను పోషించారు. అలాగే చిరంజీవి, చరణ్ లు కలిసి 'బంగారు కోడిపెట్ట' రీమిక్స్ కు నృత్యం చేశారు' అని ఎస్.ఎస్.రాజమౌళి తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|
|
|
|
|