|
|
|
| Josh | Telugu Previews | | Cast: Naga Chaitanya, Karthika, Sneha Ullal, JD Chakravarthy Director:Vasu Varma Producer:Dil Raju Music:Sandeep Chowta
 Synopsis 'జోష్' చిత్రానికి దర్శకుడు వాసువర్మ. నాగచైతన్య, కార్తిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్'రాజు నిర్మిస్తున్నారు.
'దిల్'రాజు మాట్లాడుతూ 'ఇది మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తొమ్మిదో సినిమా. కథే ఈ సినిమాకి ప్రధానబలం. ఓ కళాశాలలో చదువుకునే కుర్రాడి కథ. కాబట్టి యువతకు నచ్చుతుంది. ఆరు నెలలు శ్రమించి ఈ కథను తయారు చేశాం. దర్శకుడు వాసువర్మ కొత్తవాడైనా కథను బాగా డీల్ చేశాడు. నాగచైతన్య ఎనర్జిటిల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్. అక్కినేని అభిమానులకే కాక అన్ని వర్గాల వారినీ ఈ సినిమా అలరిస్తుంది. రాధ కుమార్తె కార్తిక ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గదీ సినిమా' అని తెలిపారు. ఈ చిత్రం సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|
|
|
|
|