|
|
|
| Jallu | Telugu Previews | | Trailer | Preview | Review | Gallery |
| Cast: Jayanth Recherla, Prerna Director:V.V.Narayana Producer:Recharla Subhash Naidu Music:Nihal
 Synopsis 'జల్లు' చిత్రానికి దర్శకుడు వి.వి.నారాయణ. ఈ చిత్రంలో జయంత్ రేచర్ల, ప్రేరణ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రేచర్ల మూవీ క్రియేషన్స్ పతాకంపై రేచర్ల సుభాష్ నాయుడు నిర్మిస్తున్నారు.
'అందం, అభ్యుదయం, ఆవేశం, ఆలోచన, ఆనందం అన్నీ సమపాళ్లలో కలిగలిసిన కుర్రడతను. మంచి పెయింటర్ కూడానూ. ఈ కుర్రాడికి కాలేజిలో ఓ అందమైన అమ్మాయి తారసపడుతుంది. తొలి చూపులోనే ఆమెను గాఢంగా ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ఆటపట్టించాలనుకుని తను ఫూల్ అవుతాడు. ఓసారి ఓ సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతంది. చివరకు ఆ అమ్మాయి మనసుని గెలుచుకుంటాడు. కానీ ఈ ప్రేమను ఓ శక్తి అడ్డుకుంటుంది. అది ఏమిటనేది తెరపై చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది' అంటున్నారు దర్శకుడు వి.వి.నారాయణ.
నిర్మాత మాట్లాడుతూ 'కథే ఈ సినిమాకి హైలైట్. చిత్రీకరణ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. నిహాల్ సమకూర్చిన పాటలు ఇప్పటికీ ప్రజాదరణ పొందాయి. రోజా, బొంబాయి సినిమాల తరహాలో ఈ చిత్ర కథాంశం ఉంటుంది' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|
|
|
|
|