|
|
|
| Billa - 2009 | Telugu Previews | | Cast: Prabhas, Krishnam Raju, Anushka, Namitha and others Director:Meher Ramesh Producer:Prabhodh, D.Narendra Music:Mani Sharma
 Synopsis 'బిల్లా' చిత్రానికి దర్శకుడు మెహర్ రమేష్. ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క జంటగా నటిస్తున్నారు. డి.నరేంద్ర, ప్రబోద్ సంయుక్తంగా గోపికృష్ణ మూవీస్ ప్రై.లి సంస్థ ద్వారా నిర్మిస్తున్నారు.
చిత్ర సమర్పకులు కృష్ణంరాజు మాట్లాడుతూ 'మా సంస్థ కొత్త ఇన్నింగ్స్ ని 'బిల్లా'తో ప్రారంభిస్తున్నాం. సంస్థ స్థాయిని చూపించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. కథాపరంగా, సాంకేతికంగాను అత్యున్నత ప్రమాణాలుంటాయి. నేను ప్రభాస్ తో కలిసి చేసిన సన్నివేశాల్ని ఎప్పటికీ మరచిపోను. ప్రభాస్ చేసిన కొన్ని సన్నివేశాలు, సాహసాలు ఆశ్చర్యపరచాయి. అతనిలో ఎంత నటుడు ఉన్నాడో తెలిసింది. దర్శకుడి శైలి ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది' అని అన్నారు.
దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ 'బిల్లా' కంటే ముందు ప్రభాస్ కి ఓ కథ చెప్పాను. ఈ సినిమా బడ్జెట్ కంటే తక్కువే. అయితే కృష్ణంరాజు 'బిల్లా'అయితే బాగుంటుంది అన్నారు. ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనకంజ వేయకుండా నాకు సహకరించారు. మలేషియాలో చిత్రించిన పోరాట సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణ' అన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|
|
|
|
|