Index
శ్రీ వెంకట సాయి ఆర్ట్స్ క్రియేషన్స్ చిత్రం ప్రారంభం శ్రీ వెంకట సాయి ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థ ఓ లవ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ సినిమాను రూపొందించనున్నది. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. గురుపౌర్ణమి నాడు షూటింగ్ ప్రారంభించారు. ఆరంభ సన్నివేశానికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ క్లాపు కొట్టగా, క్రాంతి లాబ్స్ సదాశివ రెడ్డి స్విచాన్ చేశారు. ఈ నెలలో 15 రోజుల పాటు తొలి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు దర్శక నిర్మాత ఎ.వి.రావు పేర్కొన్నారు. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. |